Posted by admin on 2025-03-20 21:40:00 | Last Updated by admin on 2025-04-08 03:36:34
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 76
ఇలా రిజిష్టర్ లో సంతకాలు చేస్తున్న వారిలో చూస్తే బాల నాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యలింగం, విరూపాక్ష, విశ్వేశ్వరరాజు, అమరనాధ్ రెడ్డి, దాసరి సుధ ఉన్నారని అంటున్నారు. వీరి సభలోకి రాకుండా రిజిష్టర్ లో సంతకాలు చేశారని ప్రచారం సాగుతోంది. అయితే దీని మీద స్పీకర్ అయ్యన్నపాత్రుడు తప్పుపట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలే కాకుండా సభకు రాని వారు రిజిష్టర్ లో సంతకాలు చేసి వెళ్ళిపోతున్న వారి తీరు మంచిది కాదని అన్నారు. గౌరవంగా సభలోకి రండి గెలిపించిన ప్రజల తరఫున ప్రజా సమస్యలు ప్రస్తావించండి అని ఆయన కోరుతున్నారు. మరి వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది చర్చగా ఉంది.
ఒక విధంగా చూస్తే కనుక వారు అధినాయకత్వం నిర్ణయానికి ఓకే చెప్పలేక అలాగని కాదనలేక మధ్యలో నలిగిపోతున్నారా అని కూడా అంటున్నారు. నిజానికి రెండు లక్షల మంది ప్రజల తరఫున ప్రతినిధిగా ఎమ్మెల్యే ఉంటారు. వారి సభలో అధ్యక్షా అని అనాలని కోరుకుంటారు. తమ ప్రాంతం సమస్యలను సభలో ప్రస్తావించి ప్రజల మన్ననలు పొందాలని చూస్తారు. ఒక విధంగా వారి పొలిటికల్ కెరీర్ కూడా ఇక్కడ ముడిపడి ఉంది. మరి వారిని సభకు రాకుండా చేయడం మంచిది కాదని అంటున్నారు. అధినాయకుడు జగన్ సభకు రాకపోయినా పులివెందులలో ఆయన గెలుపునకు ఢోకా లేదు కానీ ఇతర సభ్యులు అలా కాదు, వారు ప్రజా సమస్యలను ప్రస్తావించమాని చెప్ప్కోవాలి. ప్రజల కోసం పనిచేశామని అనిపించుకోవాలి. లేకపోతే వారి రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. మరి ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఆలోచించాలని అంటున్నారు. జగన్ సభకు రాకపోయినా తమ పార్టీ వారిని సభకు పంపించి వారి వాణిని ప్రజలకు వినేలా చేయాలని అంటున్నారు. దీని వల్ల వైసీపీకి మేలే తప్ప మరేమీ జరగదని అంటున్నారు. మరి ఏడుగురు ఎమ్మెల్యేల విషయం చూసి అయినా వైసీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తుందా అన్నదే అంతా చర్చిస్తున్నారు.
https://www.tupaki.com/latest-news/situation-of-ysrcp-mlas-1416651